హర్లీన్‌కు మోదీ ప్రశంస
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా మహిళా క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్ అద్భుతమైన క్యాచ్ పట్టింది. అమీజోన్స్ (43; 27 బంతుల్లో 4×4, 2×6) అనే ఇంగ్లిష్ బ్యాటర్‌ను బౌండరీ లైన్‌వద్ద క్యాచ్ అందుకొని పెవిలియన్ పంపించింది.
శిఖాపాండే వేసిన 18.5 ఓవర్‌కు అమీజోన్స్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడడంతో మ్యాచ్ చూస్తున్నవారంతా బంతి సిక్స్‌ర్‌గా వెళ్తుందని భావించారు. కానీ, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ చివరి క్షణాల్లో అథ్లెటిక్స్ విన్యాసాలు చేస్తూ క్యాచ్ అందుకొని వారెవ్వా అనిపించింది.
తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్ చేసింది. దాంతో విస్తుపోయిన అమీ జోన్స్ నిరాశతో పెవిలియన్ చేరింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న హర్లీన్‌ను అభినందిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ హర్లీన్ డియోల్‌ను ప్రశంసించారు. ‘మైగవ్ ఇండియా’ పంచుకున్న ఈ వీడియోను మోదీ ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్ చేశారు. ‘అసాధారణం.. వెల్డన్ హర్లీన్ డియోల్’ అని వ్యాఖ్య పెట్టారు.
That was a brilliant catch @imharleenDeol https://t.co/c0KZspHFhe— OTTRelease (@ott_release) July 10, 2021