రామ్.. పోలీస్ గా మారిన డాక్టర్ సినిమా !

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చిట్టూరి శ్రీను నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రామ్ క్యారెక్టర్ కు రెండు షేడ్ లు వుంటాయని తెలుస్తోంది. ఇందులో ఒకటి డాక్టర్..రెండోది పోలీస్. పోలీస్ గా మారిన డాక్టర్ సినిమా అని తెలుస్తోంది.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో నడిచే పక్కా లింగుస్వామి స్టయిల్ సినిమా ఇదని తెలిసింది. ఇందులో రామ్ కి జంటగా ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత.. మరోసారి మాస్ ని మురిపించాలని డిసైడ్ అయిన రామ్.. లింగుస్వామికి ఓకే చెప్పారు. అయితే ప్రస్తుతం లింగుస్వామి ప్లాపుల్లో ఉన్నాడు. అలాంటి లింగుస్వామికి రామ్ హిట్ ఇస్తాడా ? అన్నది చూడాలి. గతంలో ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ కు ఇస్మార్ట్ శంకర్ తో అదిరిపోయే హిట్ ఇచ్చాడు రామ్. లింగుస్వామి విషయంలోనూ అదే రిపీట్ అవుతుందేమో.. !