‘ఏజెంట్’ ఫస్ట్ లుక్.. అదిరింది !

స్టయిలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. తాజాగా ఏజెంట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. కండలు తిరిగిన దేహాంతో.. ఎనిమిది పలకల దేహాంతో ఉన్న అఖిల్ పోస్టర్ ని విడుదల చేశారు. హాలీవుడ్ రేంజ్ హీరోగా అఖిల్ కటౌట్ ఉంది. ఇప్పుడీ.. ఈ పిక్ ని చూసి అక్కినేని అభిమానులు ఖుషి అవుతున్నారు.

ఇక అఖిల్ మార్కెట్ ను మించి ఈ సినిమాకు బడ్జెట్ అవుతుందట. అందుకే ఓ మంచి ఓటీటీ పార్టనర్ ను భాగస్వామిగా చేసుకొని.. థియేటర్-ఓటీటీలో ఒకేసారి రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారని సమాచారమ్. ఇక అఖిల్ నాల్గో చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ రిలీజ్ కి రెడీగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అఖిల్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. గీతా ఆర్ట్స్ నిర్మించింది.