జగన్ అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్ !

రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేశారు. తెలంగాణలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఎత్తేయగా.. ఏపీలో మాత్రం ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్స్ ఓపెనింగ్ కి అనుమతులు ఇచ్చింది. కానీ అది కూడా 50శాతం ఆక్యుపెన్సీనే అని చెప్పింది. ఇదీగాక ఏపీలో టికెట్ రేట్ల పెంపు అనే సమస్య కూడా ఉంది.

వీటిపై ఏపీ సీఎం జగన్ తో చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సీఎం జగన్ అపాయిట్మెంట్ అడిగారు. మెగాస్టార్ తో సహా ఇండస్ట్రీ జనాలు ఎవరెవరో అపాయింట్ మెంట్ అడిగారని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరికి జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు. జగన్ అపాయింట్ మెంట్ ఎప్పుడు అంటే.. ? ప్రతిరోజూ రేపే అని చెప్పుకుంటున్నారు.

మరోవైపు నెలాఖరు నుంచి తిమ్మరసు, ఇష్క్, టక్ జగదీష్, లవ్ స్టోరీ, ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకన్నారు. ఏపీ సీఎం జగన్ తో భేటీ తర్వాత ఈ సినిమాల రిలీజ్ డేట్స్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారమ్.