పానీపూరీవాలాతో తేజస్వి పెళ్లి
వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. తేజస్వి అచ్చ తెలుగు అమ్మాయి. మొదట సైడ్ క్యారెక్టర్స్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రమోట్ అయింది. రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ సినిమాతో హాట్ బ్యూటీ అనిపించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనూ మెరిసింది. మాటకు ముసుగు లేకుంటే మాట్లాడే తేజస్వి బోల్డ్ హీరోయిన్ అనిపించుకుంది.
జీవితంలో ఎదురైన చేధు అనుభవాలని దృష్టిలో పెట్టుకొని.. అసలు పెళ్లి చేసుకోను అని డిసైడ్ అయిపోయింది.. ఈ ఐస్ క్రీమ్ పాప. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే చిన్నప్పుడు మాత్రం పానీపూరీ చేసే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకుందట. తనకు పానీపూరీ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆ పానీపూరీ చేసే వ్యక్తినే తాను పెళ్లి చేసుకోవాలని చిన్నతనంలో ఆశపడినట్లు పేర్కొంది. అసలు ఇప్పుడు మాత్రం జీవితంలో పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయినట్టు తెలిపింది.