జాకీ చాన్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు
ప్రముఖ సినీ నటుడు జాకీ చాన్ పొలిటికల్ ఎంట్రీ ఖారైనట్టు సమాచారమ్. జాకీ చాన్ చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జాకీ చాన్ పొలిటిల్ ఎంట్రీపై ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
“సీపీసీ గొప్పతనం కళ్లముందే కనపడుతోంది. అది ఏం చెబుతోందో, ఏం వాగ్దానం చేస్తోందో, వాటిని తప్పక నెరవేరుస్తుంది. అందుకు వందేళ్లు అవసరం లేదు. కొన్ని దశాబ్దాల సమయం చాలు. నేను ఆ పార్టీ సభ్యుణ్ని కావాలనుకుంటున్నాను” అని చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన జాకీ చాన్ వ్యాఖ్యానించినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.