క్రిస్‌గేల్‌ : టీ20ల్లో 14,000 పరుగులు

విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌టీ20ల్లో 14వేల పరుగుల మైలురాయి అధిగమించాడు. సెయింట్‌ లూయిస్‌ వేదికగా జరిగిన మ్యాచులో మొదట ఆసీస్‌ బ్యాటింగ్‌ చేసింది. 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో క్రిస్‌గేల్‌ (67; 38 బంతుల్లో 4×4, 7×6) దుమ్మురేపాడు. గేల్‌.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. మునుపటి శైలిలో భారీ సిక్సర్లు దంచాడు. ఏడు సిక్సర్లు కొట్టిన అతడు టీ20ల్లో 14వేల పరుగుల మైలురాయి అధిగమించాడు. ఈ మ్యాచ్ లో విండీస్ ఘన విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ.. “ఎంత గొప్ప క్రికెటరైనా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అభిమానులు గణాంకాలను అతిగా చూడొద్దు. కేవలం యూనివర్స్‌ బాస్‌ను గౌరవిస్తే చాలు. 42 ఏళ్లు వచ్చినా క్రిస్‌గేల్‌ ఆడుతున్నాడంటే సంతోషమే కదా” అన్నాడు.