లూసీఫ‌ర్‌ రీమేక్.. రెండు కీలక మార్పులు !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లూసీఫర్ రిమేక్ లో నటించనున్నారు. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. లూసీఫ‌ర్ ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు, అందునా మెగాస్టార్ అభిమానుల‌కు రుచించ‌క‌పోవొచ్చు. అందుకే కొన్ని కీలక మార్పులు చేసినట్టు తెలిసింది.

లూసీఫ‌ర్ లో మోహ‌న్ లాల్.. ఓ డాన్‌. అయితే… డాన్‌గా త‌ను ఏం చేశాడు? త‌న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనేది చూపించ‌లేదు. రీమేక్‌లో మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ ని చాలా క్లాసీగా, స్టైలీష్ గా తీర్చిదిద్ద‌బోతున్నార్ట‌. దాదాపు 15 నిమిషాల పాటు చిరంజీవి మాఫియా డాన్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఆ స‌న్నివేశాలు మెగా ఫ్యాన్స్ ని అల‌రిస్తాయ‌ని తెలుస్తోంది.

ఇక లూసీఫర్ క్లైమాక్స్ లో పృథ్వీరాజ్ ఆగ‌మ‌నం.. ఆక‌ట్టుకుంది. సినిమాలో అదే అసలైన ట్విస్ట్. అయితే తెలుగు రిమేక్ లో ఆ పాత్రని తీసేయాలని మొదట చిరు ఆదేశించారు. అయితే ఇప్పుడీ.. ఆ విషయంలో మనసు మార్చుకున్నారని తెలిసింది. ఆ పాత్రని అలాగే ఉంచాలని చిరు చెప్పాడట. దీంతో ఆ పాత్రలో కనిపించే హీరో ఎవరన్న చర్చ జరుగుతోంది. మహేశ్, తారక్, బన్నీ.. లలో ఒకరు కనిపించే అవకాశాలున్నాయని సమాచారమ్.