‘మా’ బిల్డింగ్ సరే.. స్థలం ఎవరిస్తారు ?
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఒక్కటే అజెండా. అదే ‘మా’ బిల్డింగ్. ఈసారి కూడా మా ఎన్నికలు ఇదే అజెండాతో జరగనున్నాయ్. అయితే ఎన్నికల ముందే మా అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ‘మా’ బిల్డింగ్ మేము కట్టిస్తాం అని మాట ఇచ్చాడు. ఈ మేరకు ‘మా’కు లేఖ రాశారు. అంతేకాదు.. మా ఎన్నికలు ఏకగ్రీవం చేస్టే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. లేదంటే పోటీలో ఉంటానని తెలిపారు.
మా బిల్డింగ్ కట్టడం పెద్ద సమస్య కాదు. మెగాస్టార్ లాంటి పెద్దలు తలచుకుంటే అది చాలా ఈజీ. అయితే ఇక్కడ మా బిల్డింగ్ కట్టడం సమస్య కాదు. అందుకు స్థలం కావాలి. తెలంగాణ ప్రభుత్వం మా బిల్డింగ్ కోసం స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి స్థలం ఇప్పించగలగాలి. ఆ తర్వాతే.. బిల్డింగ్ కట్టాలి. ఇందుకోసం 25శాతం నిధులు ఇస్తామని గతంలోనే మోహన్ బాబు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా పూర్తి బిల్డింగ్ ని కట్టిస్తానని మంచు విష్ణు హామీ ఇచ్చారు. కానీ అందుకు స్థలం ఎలా ? అనే విషయాన్ని మాత్రం విష్ణు ప్రస్తావించలేదు. అందుకే.. మా బిల్డింగ్ ఒకే.. కానీ అందుకు స్థలం ఎలా ? అని ప్రశ్నిస్తున్నారు.