దేశంలో థర్డ్ వేవ్ విజృంభణ.. ఇవే సంకేతాలు !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలన్నీ కఠిన ఆంక్షల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయి. అయితే ఇప్పుడిదే డేంజర్ గా మారుతోంది.
గత రెండు వేవ్‌ల ప్రారంభం తొలి నాళ్లలో మహారాష్ట్ర, ముంబయిలో కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. తాజాగా మరోసారి మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఇదే మూడో వేవ్ ప్రారంభానికి సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జులై నెలలో తొలి 11 రోజుల్లో మహారాష్ట్రలో 88,130 కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు వెలుగుచూశాయి.