చిన్న సినిమా పంట పడింది

‘రాజావారు రాణిగారు’ ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా “ఎస్ఆర్ క‌ళ్యాణమండంపం”. కొత్త దర్శకుడు శ్రీధ‌ర్ గాదే దర్శకత్వం వహించారు. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై ప్ర‌మోద్ – రాజు నిర్మించారు. ఇప్పుడీ.. ఈ సినిమా నక్క తోక తొక్కింది. మంచి రేటుకి అమ్ముడిపోయింది.

ఆంధ్ర 2.80 కోట్ల రేషియోలో, నైజాం 1.08 కోట్లకు విక్రయించేసారు. దాంతో ఆగస్టు 6 ను విడుదల డేట్ గా ప్రకటించేసారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ‘చుక్క‌ల చున్ని.. ‘, ‘చూసాలే క‌ళ్లార.. ‘ పాటలు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇవి సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అయ్యాయి. దాంతో మార్కెటింగ్ ఈజీ అయింది. మంచి రేటు పలికింది. సినిమా ఏమాత్రం బాగున్నా.. మంచి ఓపెనింగ్స్, మంచి లాభాలు ఖాయం.