బిగ్ షాక్ : నాని స్థానంలో ఎన్టీఆర్

నేచురల్ స్టార్ నానికి బిగ్ షాక్ తగిలినట్టు సమాచారమ్. ఆయన్ని ఉన్నట్టుండి తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 నుంచి తప్పించినట్టు చెప్పుకొంటున్నారు. ఆయన స్థానంలో మళ్లీ తారక్ ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జోరందుకొంది. ఇందులో నిజమెంత ? అనేది తెలుసుకొనేందుకు నాని, తారక్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

తారక్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తన ఈజ్, ఎనర్టితో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. ఐతే, ఇప్పుడు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్-2 చప్పగా సాగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తారక్ ముందు నాని తేలిపోయాడని చెప్పుకొంటున్నారు. ఏదో ఆడియో ఫంక్షన్ కు యాంకరింగ్ చేసినట్టుగా నాని షోని నడిపిస్తున్నాడు. దీంతో సీజన్ 1లో ప్రేక్షకులు అనుభవించిన అనుభూతి మిస్సవుతున్నారు.

మరికొందరు.. నాని చెప్పినట్టుగా బిగ్ బాస్ 2లో ఏదైనా జరగొచ్చు. సీజన్ 2 మధ్యలోనే ఆగిపోవచ్చని సటైర్స్ వేస్తున్నారు. రెస్పాన్స్ ని చూసి బిగ్ బాస్ యాజమాన్యం కూడా అలర్ట్ అయినట్టు సమాచారమ్. నానిని తప్పించి.. మళ్లీ తారక్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టినట్టు చెబుతున్నారు. ఒకవేళ తారక్ ఒప్పుకొంటే అదే జరగొచ్చు. లేదంటే.. ఈసారికి నాని తో అడ్జెస్ట్ కావడం తప్పదు. రాను రాను నాని షోని రక్తి కట్టించగలడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.