అక్టోబర్ 13 – హాట్ కేకు.. ఎవరికి దక్కేనో !

అక్టోబర్ 13 – ఇప్పుడు అందరి దృష్టి ఈ డేట్ పైనే పడింది. పెద్ద సినిమాల హాట్ ఫేవరెట్ గా మారింది. ఈ డేట్ ని ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ రిజర్వ్ చేసుకుంది. కానీ ఆ రోజున ఆర్ ఆర్ ఆర్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక వేళ ఆర్ఆర్ఆర్ రాకపోతే తమ సినిమా వేయాలనే ఆలోచనలో మెగాస్టార్ ‘ఆచార్య’ యూనిట్ వుంది. ఆ రెండు సినిమాలు కాకుంటే ‘పుష్ప’ రెడీగా ఉంది. ప్రభాస్ కూడా పోటీలో ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

అక్టోబర్ 13 మీద ఎందుకంత మక్కువ అంటే ? దసరా సీజన్. ఇలాంటి పెద్ద సీజన్ మళ్లీ రావాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. సంక్రాంతి పోటీ ఇంకా పెద్దది. సర్కారు వారి పాట, అయ్యప్పన్ కోషియమ్ రీమేక్, ఎఫ్ 3 లాంటి సినిమాలు సంక్రాంతిని పోటీలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 13పై పెద్ద సినిమాలు ఆశలు పెట్టుకున్నాయి. కనీసం ఒకట్రెండు పెద్ద సినిమాలు ఆరోజున వచ్చే అవకాశాలున్నాయి.