చిన్నారి ‘సమంతగా అల్లు అర్హ’ ?

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ త్వరలోనే వెండితెరపై సందడి చేయనుంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో అర్హ ఓ పాత్రలో కనిపించనుందని TSMirchi ముందే తెలియజేసింది. ఇప్పుడు.. అర్హ తెరంగేట్రంపై అల్లు అర్జున్ అధికారిక ప్రకటన చేశారు.

“అల్లు కుటుంబంలోని నాలుగో జనరేషన్‌కు చెందిన అర్హ వెండితెరకు పరిచయమవుతోందని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’లో అర్హ సందడి చేయనున్నారు. నా కుమార్తెను ఇలాంటి అందమైన సినిమాతో వెండితెరకు పరిచయం చేస్తున్న గుణశేఖర్‌, నీలిమకు కృతజ్ఞతలు” అని బన్నీ ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో అల్లు అర్హ చిన్నారి సమంతగా కనిపిస్తుందా ? లేక ఇతర కీలక పాత్రలో కనిపించనుందా ? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  నీలిమ గుణ నిర్మిస్తున్నారు.