హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం
హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్ ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. చంఢీగఢ్లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు.
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన బండారు దత్తాత్రేయని ఇటీవలే కేంద్రం హరియాణాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు.