ప్లాన్-B చెప్పేసిన రేవంత్ రెడ్డి

ప్రభుత్వానికి, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగితే.. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వేయడం సాధారణం. మరీ.. ఆ పోలీస్ స్టేషన్స్ నే ముట్టడిస్టే.. పరిస్థితి ఏంటీ ? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అదే చేస్తామని హెచ్చరిస్తోంది.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం మొదలెట్టారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి పులుపునిచ్చారు రేవంత్ రెడ్ది. హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు రేవంత్‌ తెలిపారు. రేపు తమ శ్రేణుల్ని అడ్డుకుంటే పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో.. రేవంత్ ప్లాన్ -బి ని ముందే చెప్పేసినట్టయింది.