ఆ వార్తలు అవాస్తవం.. సోషల్ మీడియాపై ఎర్రన్న ఫైర్ !

నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి కష్టాల్లో ఉన్నారు. కనీసం రెంట్ కూడా కట్టలేని దీన పరిస్థితుల్లో.. ఆయన సినీ దూరంగా చిన్న పల్లెలో నివాసం ఉంటున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ‘రైతన్న’ ప్రీమియర్ షోస్ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ చేసిన వ్యాఖ్యలే కారణం. ‘నారాయణమూర్తికి ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. బండి లేదు. నడుచుకుంటూ వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’ అని గద్దర్ అన్నారు.

ఆ వ్యాఖ్యలని ఆధారంగా చేసుకొని.. చాలా స్టోరీలు అల్లేస్తోంది సోషల్ మీడియాలో. ఆర్ నారాయణ మూర్తిని దీనస్థితిలో ఉన్నాడు. రెంట్ కూడా కట్టలేకపోతున్నాడు.. ఇలా చాలా వార్తలు రాస్తున్నారు. తాజాగా ఈ ప్రచారంపై నారాయణ మూర్తి స్పందించారు. సోషల్ మీడియాకు క్లాస్ పీకారు. ఇదేం జర్నలిజం అని ప్రశ్నించారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. తన దగ్గర డబ్బు ఉంది. నాకు పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం.. అందుకే అక్కడ ఉంటున్నా. దయచేసి.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి. దీని వలన తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్ చేసి.. సాయం చేస్తామని అడుగుతున్నారు. వారి ప్రేమ, ఆప్యాతకు ధన్యవాదాలు అన్నారు. 

ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆర్ నారాయణ మూర్తి తీసిన రైతన్న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాని ఎప్పుడెప్పుడూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానా ? అనే ఆతృతలో ఉన్నట్టు ఎర్రన్న తెలిపారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. దయచేసి.. ఇలాంటి అవాస్తవాలని ప్రచారం చేయొద్దని విజ్ఝప్తి చేశారు.