జల వివాదం : ఇవాళ మీడియా ముందుకు కేసీఆర్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి పెంపుపై కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబ‌ర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానుంది. బచావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులున్న ప్రాజెక్టుల‌న్నీ కృష్ణాబోర్డు ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం పేర్కొంది. కృష్ణాన‌దిపై 36, గోదావ‌రిపై 71 ప్రాజెక్టుల‌ను ఈ బోర్డు ప‌రిధిలోకి తీసుకొచ్చింది. 

కేంద్రం విడుదల చేసిన గెజిట్ ని ఏపీ ప్రభుత్వం స్వాగతించగా.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇది తెలంగాణకు అన్యాయం చేసే చర్యే అని అంటోంది. ఈ నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మీడియా ముందుకు రానున్నారు. మరీ.. వాటర్ వివాదంపై సీఎం కేసీఆర్ ఏయే విషయాలు చెబుతారు ? ఎలా ముందుకు వెళ్లనున్నారు ? అన్నది తెలియనుంది.