భర్తలకు గుడ్ న్యూస్

భర్త బాధితులు మాత్రమే కాదు.. భార్య బాధితులు ఈ సమాజంలో ఉన్నారు. అయితే వారికి న్యాయం జరగడం లేదనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. వేధింపులకు గురైన భార్య భర్తపై గృహ హింస కేసు పెట్టొచ్చు. కటకటాల వెనక్కి పంపొచ్చు. కానీ అదే భార్య బాధితులకు ఆ ఛాన్స్ లేదు. భార్య చేతిలో హింసించబడిన.. కామ్ గా ఉండాల్సిందే. 

ఇప్పుడు భార్య బాధితులకు ఢిల్లీ హైకోర్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. గృహ హింసకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు విచారించింది. భార్యలను భర్తలు వేధించడమే కాదు.. భార్యలూ భర్తలను వేధిస్తున్నారు అనే పిటిషన్‌ అది. ఇక నుంచి మహిళలపై కూడా గృహ హింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది. భర్తను వేధించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని స్పష్టం చేసింది.