శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా టార్గెట్ 276
రెండో వన్డేలో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (50; 71 బంతుల్లో 4×4, 1×6), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ చారిత్ అసలంక (65; 68 బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నె (44 నాటౌట్; 33 బంతుల్లో 5×4) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
లంక ఓపెనర్లు శుభారంభం చేశారు. 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాత టీమిండియా బౌలర్లు విజృంభించి.. లంక నడ్డీ విడిచారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. అయితే చివర్లో కరుణరత్నె 44 (నాటౌట్) బ్యాటు ఝులిపించడంతో.. లంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్, చహల్ చెరో 3 వికెట్లు, దీపక్ చహర్ 2 వికెట్లు పడగొట్టారు.