మా ఎన్నికలు.. తెరపైకి మూడో వ్యక్తి !
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు కొత్త టర్న్ తీసుకున్నట్టు కనబడుతోంది. మూడ్నెళ్ల ముందే మా ఎన్నికల హీట్ మొదలైన సంగతి తెలిసిందే. మా అధ్యక్ష పోటీలో ఉంటున్నట్టు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, ఏవీఎల్ నరసింహారావు ప్రకటించారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజ్-మంచు విష్ణు ప్యానల్ ల మధ్య ఉంటుందని భావించారు. మెగా మద్దతు ప్రకాష్ రాజ్ కే ఉండటంతో.. ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కవనే వార్తలు వినిపించాయి.
మరోవైపు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్, విష్ణు లోకల్.. లోకల్ వారినే గెలిపించాలనే నినాదం కూడా వినిపించింది. ఇంతలో ఏవీఎల్ నరసింహారావు తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ఈ సారి మా ఎన్నికలు థ్రిల్లర్ సినిమాని తలపించడం ఖాయం అనుకున్నారు. ఇలాంటి టైమ్ లో మంచు విష్ణు కొత్త వ్యూహాలతో ముందుకొచ్చారు. మా బిల్డింగ్ నిర్మించే బాధ్యత నాదే అన్నాడు. బిల్డింగ్ సరే.. మరి స్థలం ఎలా ? అంటూ నాగబాబు అడిగిన ప్రశ్నలకు కూడా గట్టి సమాధానం ఇచ్చారు విష్ణు.
ఇదిలా కొనసాగుతుండగానే బాలయ్య సపోర్ట్ మంచు విష్ణుకే అన్న విషయం క్లారిటీ వచ్చింది. దీంతో ఇండస్ట్రీ ప్రకాష్ రాజ్-మెగా ఫ్యామిలీ, మంచు విష్ణు-నందమూరి ఫ్యామిలీలుగా రెండు గా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఏకగ్రీవం చేస్తే… తాను పోటీ నుంచి తప్పుకుంటానని విష్ణు ప్రపోజల్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవం కానున్న ఆ మూడో వ్యక్తి ఎవరు ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య ఓకే అంటే.. ఎవరు మాట్లాడరు. ఆయన్ని ఏకగ్రీవం చేస్తారు. కానీ అందుకు బాలయ్య సిద్ధమా ? తెలియాల్సి ఉంది.
బాలయ్య కాకుండా అందరి యోగ్యమైన మరో వ్యక్తి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. మా అధ్యక్షుడిగా ప్రకాష్ కాకుండా ఉండేందుకు మంచు విష్ణు వర్గం పక్కా వ్యూహాలని ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరీ.. ఆ వ్యూహాలని చెక్ పెట్టేల ప్రకాష్ రాజ్ వ్యూహాలు ఉంటాయా ? మెగా సపోర్ట్ తో ఆయన మా అధ్యక్షుడు అవుతారా ? అన్నది తెలియాలంటే.. ?? మరికొన్నాళ్లు ఆగాల్సిందే.