కేటీఆర్ ట్రయలేశాడు..

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్రయల్ వేశారు. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు నిర్వహించిన మెట్రో ట్రయల్‌ రన్‌ను మంత్రి పరిశీలించారు. మంత్రి మహేందర్ రెడ్డి, అధికారులతో కలిసి కేటీఆర్ మెట్రో ప్రయాణం చేశారు. అనంత్రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో నిర్మాణం చేపడుతున్నాం. మెట్రో కారిడార్‌లో 42 ప్రదేశాల్లో మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేశాం. ఎంజీబీఎస్‌, నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మెట్రోకు అనుసంధానం చేశాం. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఛార్జింగ్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేశాం. మెట్రో ప్రారంభమై 7 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు’ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ నమ్మకంగా ఉన్నారు. తెరాస మళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఇప్పటికే కేటీఆర్ ప్రతిక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆగస్టు కల్లా ఇంటింటికి నల్లా నీటిని అందించబోతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలోనూ వేగం పెంచుతున్నారు.