తారక్ బాలీవుడ్ వేట

ఒక్కసారి పాన్ ఇండియా సినిమా చేసిన హీరో.. మళ్లీ పాన్ ఇండియా సినిమానే చేయాలి. బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలని చేస్తున్నాడు. ఇందుకోసం బాలీవుడ్ దర్శకుల వైపు చూస్తున్నాడు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్ టీఆర్ పరిస్థితి ఇదే. ఆయనకు బాలీవుడ్ దర్శకుల అవసరం పడింది.

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా చేస్తున్నారు. ఇది పాన్ సినిమానే అంటున్నారు. ఆ తరువాత  ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా సినిమానే.ఇక ఆ తరువాత ఏంటీ అన్నది ప్రశ్న. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బాలీవుడ్ డైరక్టర్ల కోసం చూస్తున్నారు. సరైన బాలీవుడ్ డైరక్టర్ దొరికితే మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారని సమాచారమ్.