‘మా’ ఎన్నికలు.. లెటెస్ట్ అప్ డేట్ !
ఇప్పటికే మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హీట్ మొదలై.. కాస్త చల్లారింది. ఈ నేపథ్యంలో వెంటనే మా ఎన్నికలని నిర్వహించాలని కొందరు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో కృష్ణం రాజు సారథ్యంలోని డీఆర్సీ కమిటీ సమావేశమై ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడాలని తీర్మానించారు.
డీఆర్సీ నిర్ణయం మేరకు ఆగస్టులో సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఎన్నికల నిర్ణయం, డీఆర్సీ సూచనలు సర్వ సభ్య సమావేశానికి వదిలిపెట్టాలని నిర్ణయించారు. థర్డ్ వేవ్ లేకుంటే, అలాగే కేంద్రం గైడ్ లైన్స్ మారితే సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరగవచ్చు. లేదంటే.. ఈ నాన్సుడు ఇలాగే కొనసాగనుంది.
ఈరోజు జరిగిన సమావేశంలో క్రమశిక్షణ, రీకన్సిలియేషన్ కమిటీ చైర్మన్ కృష్ణం రాజుతో పాటు, మోహన్ బాబు, శివకృష్ణ, గిరిబాబు, మురళీ మోహన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి జీవిత కూడా హాజరయ్యారు.