పెగాసస్‌పై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లను శుక్రవారం స్వీకరించింది. వచ్చేవారం విచారణ చేపట్టనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. తాజా పార్లమెంట్ సమావేశాలని ఈ అంశం కుదిపేస్తోంది. హ్యాకింగ్‌పై కేంద్రం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు సుప్రీం ఓకే చెప్పడం ప్రాధాన్యతని సంతరించుకుంది.