ఆగస్టు 1 నుంచి ఏటీఎం విత్డ్రా ఛార్జీలు పెంపు
ఆదివారం (ఆగస్టు 1) నుంచి ఏటీఎం విత్డ్రా ఛార్జీలు పెరగనున్నాయి. అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది.
ఇక ఐసీసీఐ బ్యాంకు కొత్త నిబంధనలు కూడా ఆదివారం నుంచే అమలులోని రానున్నాయి. ఐసీసీఐ ఖాతా దారులకు నగదు జమ, వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి రూ.150 రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. రూ.25,000 వరకూ రూ.150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్బుక్కు రూ.20 చెల్లించాలి.