ఈనెల 16 నుంచి దళితబంధు అమలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఈ నెల 16 నుంచే అమలు కాబోతుంది. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా హుజూరాబాద్ లో అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆదివారం సమావేశమైన తెలంగాణ కేబినేట్ నిర్ణయించింది. దళిత బంధు అమలుతో పాటు పలు కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

ఈ నెలలోనే రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. రూ. 50వేలు లోపు తీసుకున్న రుణాలని ఈ నెలలో మాఫీ చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ఇక ఫించన్ల అర్హత వయసుని 57యేళ్లకు తగ్గిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్తగా మంజూరైన ఏడు వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరమే వైద్య కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌, చెస్ట్‌ ఆసుపత్రి ప్రాంగణం, టిమ్స్‌లో, గడ్డిఅన్నారం మార్కెట్‌, ఆల్వాల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.