సింధు బంగారు కలను నెరవేర్చుకుంటుందా ?
2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పి.వి సింధు రజతం గెలుచుకుంది. తాజాగా టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. మరీ.. బంగారు కలను సింధు నెరవేర్చుకుంటుందా.. ? ఇందుకోసం సింధుకి మరో అవకాశం కనిపిస్తోంది. అదే.. పారిస్ ఒలింపిక్స్. 2024లో ఆరంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌కు ఇంకో మూడేళ్ల సమయం మాత్రమే ఉంది.
సింధు వయసు 26 యేళ్లు.. అప్పటికీ 29 ఏళ్లు వస్తాయి. ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ చూస్తుంటే ఆమె ఆ క్రీడల్లోనూ స్వర్ణానికి పోటీదారే అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉన్న ఆమె దానిపై మరింత దృష్టి పెట్టి ఆటలో నిలకడగా ముందుకు సాగితే కచ్చితంగా పారిస్ విమానం ఎక్కే అవకాశం ఉంది. ఆ క్రీడల్లో సింధు తన స్వర్ణం కల నేర్చుకొనే అవకాశం ఉంది.