థియేటర్స్ ఓపెన్.. ఆ రేంజ్ లేదు !

కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం మళ్లీ ప్రేక్షకులని థియేటర్స్ కి తీసుకొచ్చే బాధ్యతని మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీసుకున్నారు. ఆయన నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని థియేటర్స్ లో చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కరోనా భయాన్ని లెక్క చేయకుండా.. థియేటర్స్ కి వచ్చి సినిమా చూశారు. దీంతో.. ఆ తర్వాత రిలీజైన సినిమాలకు భయం పోయింది. ఎప్పటిలాగే థియేటర్స్ కళకళాడాయి. అయితే సెకండ్ వేవ్ అనంతరం థియేటర్స్ తెరచుకున్న.. ఫస్ట్ అప్పటి రేంజ్ కనిపించలేదు.

తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో థియేటర్స్ రీ ఓపెన్ కి అనుమతులు ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం గత శుక్రవారం నుంచి మాత్రమే అనుమతిని ఇచ్చింది. అది కూడా 50శాతం ఆక్యుపెన్సీతోనే. మొత్తానికి.. శుక్రవారం నుంచి థియేటర్స్ తెరచుకున్నాయి. తిమ్మరసు, ఇష్క.. లాంటి సినిమాలు థియేటర్స్ కి వచ్చేశాయి. కానీ మొదటి రోజు ఆశించన రేంజ్ స్పందన కనిపించలేదు. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, సెకెండ్ షో లేకపోవడంతో పెద్దగా ఫిగర్లు కనిపించలేదు.

రెండో రోజు శనివారం కావడంతో కలెక్షన్లు కాస్త పుంజుకున్నాయి. ఆదివారం పరిస్థితి ఇంకాస్త మెరుగైంది. రిలీజైన సినిమాలకు నెగటివ్ టాక్ రావడం కూడా ప్రేక్షకులు థియేటర్స్ రాకపోవడానికి కారణమని చెబుతున్నారు. ఓ పెద్ద సినిమా వస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు. జనాలు ఎప్పటిలాగే థియేటర్స్ కి వచ్చేవారు. థియేటర్స్ సందడి కనిపించేది అంటున్నారు.