టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు చావు డప్పు

సీఎం కేసీఆర్ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని త్వరలో ఉపఎన్నిక జరగనున్న హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం సీఎం కేసీఆర్ మరోసారి దళితులని మోసం చేయడానికి రెడీ అయ్యాడు.. కేవలం హుజూరాబాద్ లో గెలుపుకోసమే దళిత బంధుని తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. 

మరోవైపు ‘దళిత బంధు’ కౌంటర్ ఎటాక్ ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేవలం హుజురాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా కాకుండా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల ఎదుట చావు డప్పు కొట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పిలుపుకు ప్రజల నుంచి కూడా మద్దతు వస్తుండటం విశేషం.