ఇటు ఉత్తమ్.. అటు గంటా !
తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల గురించి హాట్ హాట్ గా చర్చించుకొంటున్నారు. ఏపీలో మంత్రి గంటా, తెలంగాణలో టీ-పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల వ్యవహారాలు హైలైట్ గా నిలిచాయి. వీరిలో మంత్రి గంటా పార్టీ నేతల తీరుపై మనస్తాపం చెంది.. పార్టీ మారే ఆలోచన చేశాడు. ఉత్తమ్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఉత్తమ్ దించాలని ఆల్టీమేటం జారీ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడీ ఇద్దరు నేతల ఏపీసోడ్స్, పరిణామాల గురించి తెలుగు ప్రజలు హాట్ హాట్ గా చర్చించుకొంటున్నారు.
మంత్రి గంటా మూడు రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలే కాదు.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మంత్రివర్గ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. విశాఖ జిల్లాలో జరగబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలోనూ పాల్గొనే అవకాశం లేదన్నట్లుగా సంకేతాలిచ్చారు. ఇప్పుడీ గంటా చల్లబడినట్టు తెలుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని గంటాని దారిలోకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు.
ఇక, ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు తనపై ఫిర్యాదులు ఇచ్చి ఉండరని ఉత్తమ్ అంటున్నారు. ఉత్తమ్ విషయంలో కాంగ్రెస్ నేతలు నోరు విప్పడం లేదు. ఒకవేళ తమ ఫిర్యాదులపై రాహుల్ స్పందికుంటే.. ఉత్తమ్ నే టీపీసీసీ ఛీఫ్ గా కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ దృష్టిలో ముందుగానే చెడు పేరు తెచ్చుకొనేందుకు ఎవరు ఇష్ట పడటం లేదు. ఉత్తమ్ ని తప్పించడం ఖాయమని తేలిన తర్వాత బ్లాస్ట్ అయ్యేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారమ్.