#RRR : ‘దోస్తీ’ పాట రెండో వర్షన్ కూడా ఉందా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజ‌మౌళి తెరకెక్కుస్తున్న భారీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి దోస్తీ పాట విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఈ పాట కోసం సుమారు 3 కోట్ల ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. అయితే దోస్తీ పాట‌కు ఇది ఒక వెర్ష‌న్ మాత్ర‌మే. మ‌రో వెర్ష‌న్ కూడా ఉందట. దాన్ని సినిమాలో చూపించబోతున్నారు. ఈ దోస్తీ పాట‌లో మాత్రం చిత్ర‌బృందం అంతా క‌నిపిస్తుంది. రాజ‌మౌళి, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియాభ‌ట్, సింథిల్.. ఇలా ఈ సినిమా కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ పాట‌లో క‌నిపిస్తారు. ఎండ్ టైటిల్స్ లో ఈ పాటని ప్లే చేయబోతున్నారు.