మారుతికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుసగా సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ఇప్ప‌టికే మోహ‌న్ రాజా, బాబి, మెహ‌ర్ ర‌మేష్ క‌థ‌ల‌కు ఓకే చెప్పారు. ఇప్పుడు మారుతి క‌థ‌కీ ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. 

మెగాస్టార్ తో సినిమా చేయాలని మారుతి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చిరు కోసం రెండు, మూడు కథలు కూడా రాసుకున్నారు. ఇటీవల చిరుకి మారుతి కథ చెప్పాడట. అది చిరుకి  నచ్చింది. చిరుకు చెప్పకంటే ముందు ఈ కథని అల్లు అరవింద్ కి చెప్పాడట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే చిరు చెప్పారట. 

ఇద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఈ కథ సినిమాగా రాబోతుందని చెప్పుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా చేయలేదు. ఆ లోటు మారుతి సినిమాతో తీర్చబోతున్నారు అన్నమాట.