దిగు దిగు దిగు నాగ.. అదిరిపోయింది !

మంచి మంచి తెలంగాణ జానపద గీతాలు ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేసాయి. మేర్లపాక గాంధీ రాయలసీమ జానపదాన్ని సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నం కొంత చేసారు. ఇప్పుడు ఆంధ్ర జానపదం తెలుగు తెరపై చిందేయనుంది.  యుంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మలతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’.

ఈ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగ’ ఆంధ్ర జానపదంని పెట్టారు. సినిమాలో తొలి సాంగ్ గా దీన్ని విడుదల చేశారు. హీరోయిన్ రీతూ వర్మ మీద చిత్రీకరించిన ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా వుంది. రీతూ వర్మను వీలయినంత అందంగా చూపించారు. అనంత్ శ్రీరామ్ జానపద గీతాన్ని సినిమా గీతంగా మార్చారు.