మల్లన్న సాగర్ పనులు అడ్డుకున్న ఎర్రవల్లి గ్రామస్తులు…!!

మ‌ల్ల‌న్న సాగ‌ర్ పున‌రావాసం విష‌యంలో ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌నివ్వ‌క‌పోవ‌డంతో సీఎం కేసీఆర్ సొంత ఇలాకా ఎర్ర‌వ‌ల్లి గ్రామంలో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.గ్రామానికి చెందిన నేతలు అక్రమాలకు పాల్పడుతూ, అధికారులతో , నేతలతో లాలూచీ పడుతూ గ్రామానికి అన్యాయం చేస్తున్నారని గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. పునరావాసం, పరిహారం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే పనులు జరుగితున్నాయ‌ని, ఇబ్బందులు ఎదురువుతున్నా ఎవ‌రూ స్పందించడం లేదని గ్రామ మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నేతల వత్తిడి తో వెనక్కి తగ్గి, ఊరికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని మ‌హిళ‌లు ఆగ్ర‌హంతో కాలువ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని అధికారుల‌తో చ‌ర్చ‌ల‌కు తీసుకెళ‌తామ‌ని హామీ ఇవ్వ‌డంతో ధ‌ర్నా విర‌మించారు గ్రామ‌స్తులు.