కరోనా.. సాధారణ జలుబు కానుందా !?
వచ్చే కొన్నేళ్లలో కరోనా బాగా తగ్గిపోనుంది. సాధారణ జలుబు కలిగించే ఇతర కరోనా వైరస్‌ల తగ్గనుంది. ఈ విషయాన్ని అమెరికా-నార్వే పరిశోధకుల మోడలింగ్‌లో తేలింది. ప్రపంచ జనాభాలో ఎప్పటికీ ఉండేలా రూపాంతరం చెందినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండబోదని శాస్త్రవేత్తలు చెప్పారు.
వయసు పెరిగేకొద్దీ కొవిడ్ తీవ్రత కూడా పెరుగుతుందని ఆ వ్యాధి తీరు తెన్నులను బట్టి స్పష్టమవుతోంది. అయితే పెద్దలు టీకాలు వేయించుకోవడం లేదా ఇప్పటికే ఒకసారి వైరస్ బారినపడటం వల్ల కరోనా ముప్పు క్రమంగా పిల్లలవైపు మళ్లుతుందని మా మోడలింగ్‌లో వెల్లడైంది. ఇతర కరోనా వైరస్‌లు, ఇన్‌ఫ్లూయెంజాల విషయంలోనూ ఇలానే జరిగింది.
1889-1890లో వచ్చిన రష్యన్ ఫ్లూ వల్ల 10 లక్షల మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది 70 ఏళ్లు పైబడినవాళ్లే. ఆ వ్యాధి కారక ‘హెచ్‌సీఓవీ-ఓసీ43’ వైరస్ ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇది స్వల్పస్థాయి జలుబు కలిగించే స్థాయికి తగ్గిపోయింది. అది కూడా ఎక్కువగా 7-12 నెలల చిన్నారులపై ప్రభావం చూపుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కూడా సాధారణ జలుబుగా మారనుందని విశ్లేషిస్తున్నారు.