రెండో టెస్ట్ : కెఎల్ రాహుల్ సెంచరీ (నాటౌట్)
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన.. దాటిగా ఆడుతోంది. తొలిరోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (127*; 248 బంతుల్లో 12×4, 1×6), రోహిత్ శర్మ (83; 145 బంతుల్లో 11×4, 1×6) తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు.
బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ పై అద్భుతంగా బ్యాటింగ్ చేయడం విశేషం. మొదట రోహిత్ శర్మ దూకుడుగా ఆడితే.. కె ఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడాడు. అయితే రోహిత్ అవుటైన వెంటనే రాహుల్ గేర్ మార్చాడు. జిమ్మీ అండర్సన్, మార్క్‌వుడ్, ఒలీ రాబిన్సన్ బౌలింగ్‌ను ఉతికారేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (42; 103 బంతుల్లో 3×4) రాణించాడు.