గాంధీభ‌వ‌న్ లో వాడివేడి చ‌ర్చ‌…!!

గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత‌స్థాయి స‌మావేశం హాట్ హాట్ గా సాగుతోంది. పలువురు నేతల ఢీల్లి పర్యటన పై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, విహెచ్ నిల‌దీశారు. బర్త్ డే శుభాకాంశాలు చెప్పడానికి వెళితే ఎవ్వరు వ్యతిరేకించరని, కానీ మీడియాలో హైప్ వచ్చే విదంగా నేతలు మాట్లాడడం సరికాదంటూ వాదించారు. అది పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌ని పొంగులేటి స‌మావేశంలో కొంద‌రిని ప్ర‌శ్నించారు. భ‌ట్టివిక్ర‌మార్క పొంగులేటిని అడ్డుకుని స‌ముదాయించారు.

మ‌రోవైపు డీకే అరుణ కూడా పీసీసీ వైఖ‌రిపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి విషయంలో పార్టీ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. నాగం పార్టీలో చేరిన తరువాత ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు సమన్వయం చేయలేదని ప్ర‌శ్నించారు. టిఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతామంటే పీసీసీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. నారాయణ్ పెట్ నుంచి శివకుమార్ రెడ్డి , జెడ్చేర్ల నుంచి ఎర్ర శేఖర్ పార్టీ లోకి వస్తానంటే పీసీసీ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని చెప్పారు.

కొందర్నిఎవరితో చర్చించకుండా చేర్చుకొని… మరి కొందరిని ఎందుకు పార్టీలోకి రాకుండా అపుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. వారు చేరుతామని వస్తున్నా ఆలస్యం చేయడానికి కారణాలేంటని ఆ స‌మావేశంలో ఆమె ప్ర‌శ్నించారు..
పీసీసీ వారిని ఎక్కడ చేర్చుకున్న తాను తీసుకురావడానికి సిద్దంమ‌ని స్ప‌ష్టం చేశారు.