మళ్లీ కరోనా మృత్యుపంజా.. ఒక్కరోజులోనే 10 వేల మంది మృతి !

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి 7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 10 వేల మందికి పైగా మరణించారు. అమెరికాలో అత్యధికంగా 1.43 లక్షల కేసులు, 660 మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్, ఇరాన్‌లో వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. బ్రిటన్‌లో కొత్తగా 33,074 కరోనా కేసులు బయటపడ్డాయి. జులై 23 తర్వాత నమోదైన అత్యధిక కేసులు ఇవేనని, డెల్టా వేరియంట్‌ వ్యాప్తే ఇందుకు కారణమని అక్కడి అధికారులు చెప్పారు.

ఇక చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో ఎలాంటి నైపుణ్యం, రక్షణ లేకుండానే కరోనా వైరస్‌పై పరిశోధనలు జరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు పీటర్‌ బెన్‌ ఎంబరెక్‌ సంచలన విషయాలు బయటపెట్టారు. చైనాలో కరోనా వైరస్‌ ఆవిర్భావం గురించి దర్యాప్తు చేసేందుకు వెళ్లిన నిపుణుల బృందంలో ఈయనొకరు.