‘మా’ బరిలోకి బండ్ల
‘మా’కు సొంత బిల్డింగ్ కావాలి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఇదే అజెండా. ఈ సారి ఇదే అజెండాతో మా ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. ఈ సారి మా అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు ఉంటున్నట్టు ప్రకటించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, ఏవీఎల్ నరసింహారావు పోటీలో ఉండనున్నారు.
ఇప్పటి వరకు ‘మా’కు కొత్త బిల్డింగ్ అజెండానే ప్రచారం జరిగింది. మా బిల్డింగ్ కట్టించే బాధ్యత తనదని మంచి విష్ణు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరుకు వరుసగా మా కు లేఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వర్గం అలర్టయింది. ప్రస్తుతం మాకు సొంత బిల్డింగ్ నే అవసరం లేదని ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేస్తున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.
‘మా’లో దాదాపు 900 మంది వరకు సభ్యులు ఉన్నారని, వారిలో 150 మంది వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండ్ల గణేశ్ అన్నారు. ఈ నేపథ్యంలో, ‘మా’కు సొంత భవనం కట్టేందుకు అవసరమయ్యే రూ.20 కోట్ల ఖర్చుతో పేద ఆర్టిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. ‘మా’కు సొంత భవనం లేనందువల్ల చిత్ర పరిశ్రమకు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఏదీ ఆగిపోదని అన్నారు. ‘మా’కు సొంత బిల్డింగ్ నిర్మాణానికి తాను వ్యతిరేకం అని బండ్ల గణేశ్ తెలిపారు. బండ్ల మాటలతో మంచు విష్ణు వర్గం డిఫెన్స్ లోకి వెళ్లినట్టయింది. ఇక వచ్చే నెలలో మా ఎన్నికలు జరగనున్నాయి.