అఖండ.. దసరాకి ఖాయం !

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్. దసరా కానుకగా బాలయ్య సినిమా రాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న చిత్రం ‘అఖండ’. టాకీ పార్ట్ పూర్తయింది. రెండు పాటలు మాత్రమే తెరకెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దసరా కానుకగా అఖండ రావడం ఖాయం అంటున్నారు.

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. అఖండ్ కూడా వీటి సరసన నిలుస్తుందనే ధీమాతో చిత్రబృందం ఉంది. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ఆయనకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.