థియేటర్స్ లో ‘సీటీమార్‌’ ఎప్పుడంటే ?

సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా హీరోయిన్. స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన చిత్రమిది. గోపీచంద్‌ ఆంధ్ర కబడ్డీ జట్టుకి కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకి కోచ్‌గా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 3న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి, పాటలకి మంచి స్పందన వచ్చింది. దిగంగన సూర్యవంశీ, భూమిక, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, రెహమాన్‌, తరుణ్‌ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అప్సర రాణి ప్రత్యేక గీతం చేసింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.