మూడో టెస్టు : పిచ్ పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోహ్లీ
ఇంగ్లాండ్ పై రెండో టెస్ట్ గెలిచిన కోహ్లీ సేన జోరు మీదుంది. ఈరోజు నుంచి జరగనున్న మూడు టెస్టులోనూ విజయం సాధించి.. సిరీస్ లో దూసుకెళ్లాలని ఆశపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. పిచ్ పై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పూర్తిగా పచ్చికతో కూడిన పిచ్‌ను రూపొందిస్తారని భావించాం. కానీ పిచ్‌పై తక్కువ పచ్చిక కనిపిస్తోంది. కాబట్టి అశ్విన్‌కు ఆడించే ఛాన్స్ ఉందన్నారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై 30-40 పరుగులు చేస్తే కుదురుకున్నట్టుగా భావించొద్దు. ప్రపంచంలోని ఎక్కడి స్టేడియంతో పోల్చినా ఇంగ్లాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని కోహ్లీ తెలిపాడు. ఓపికగా, క్రమశిక్షణగా ఆడాల్సి ఉంటుందన్నాడు. ఇక ఊరికే తమ జట్టు కూర్పును మార్చబోమని వెల్లడించాడు. ఆటగాళ్లు గాయపడితే తప్ప గెలుపు కూర్పును మార్చబోమని తెలిపాడు.