మెట్రో నగరంలో మెగా వ్యాక్సినేషన్

హైదరాబాద్ లో మెగా వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. బుధవారం ఈ కార్యక్రమాన్ని సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో 100శాతం అర్హులైన వారికి చేపట్టిన కొవిడ్ వ్యాక్సిన్  కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు.

ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. పదిరోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని.. అవసరమైతే పొడగిస్తామని వెల్లడించారు. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో ఇంత పెద్ద స్థాయిలో మెగా వ్యాక్సినేషన్  ప్రోగ్రాం నిర్వహించలేదని సీఎస్ అన్నారు.  ప్రజలందరు వాక్సిన్ తీసుకోవాలని కోరారు.