ఈనాడు రాజకీయంపై శ్రీధర్ క్లారిటీ
ఈనాడుకి కార్టూనిస్ట్ శ్రీధర్ స్పెషల్ బ్రాండ్. ఈనాడు వయసు మొత్తం 47 ఏళ్ళు అయితే అందులో 40 ఏళ్ళు శ్రీధర్ పని చేసారు. శ్రీధర్ కార్టూన్ కి వున్న క్రేజ్ మామూలుది కాదు. పేపర్ మొత్తం చదవడానికి ముందే కిందనున్న “ఇదీ సంగతి” కార్టూన్ చూసే పాఠకులు లక్షల్లో ఉంటారు. అటువంటి శ్రీధర్ ఈనాడుకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక కారణాలు గురించి ఎవ్వరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన రాజీనామా పై పూర్తి క్లారిటీ ఇచ్చారు శ్రీధర్.
”సోషల్ మీడియాలో రాస్తుందంతా తప్పుల తడక. జస్ట్ ఈనాడులో పని మానేసి వచ్చేశా అంతే, మరో కారణం ఏమీ లేదు. అనవసర ఊహాగానాలు వద్దు. ప్లీజ్” అని ఫేక్ బుక్ వేదికగా తన రాజీనామాపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్లారిటీతోనైనా శ్రీధర్ రాజీనామా వెనుక అనే కధనాలకు తెర పడుతుందేమో చూడాలి.