ఆధ్మాత్మిక మొగుడు కావాలి
ప్రేక్షకులు మాత్రం రాశీఖన్నాని ఇప్పటికీ గ్లామర్ హీరోయిన్ గా చూస్తున్నారు. అందంతో ఆమె చేసిన మాయ అలాంటిది. అయితే మొగుడు విషయంలో మాత్రం రాశీ భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆధ్మాత్మిక మొగుడు కావాలని కోరుకుంటోంది. తనకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినా ఫర్వాలేదట. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని షరతు విధించింది. అలాంటి మగాన్ని వెతికి మొగున్ని చేసుకుంటానని ముద్దుగుమ్మ మురిపెంగా చెబుతోంది.
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు కెరాఫ్ అడ్రస్ గా నిలిచింది.. ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పలేదు. దీంతో ఆమెకు వరుసగా గ్లామర్ పాత్రలు వచ్చి పడ్డాయి. వాటికి న్యాయం చేసింది కూడా. అయితే ‘తొలిప్రేమ’ రాశీఖన్నాలోని నట విశ్వరూపం బయటపడింది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు.. నటనని ఆస్కారం ఉన్న పాత్రల్లోనూ నటిస్తోంది.