దాదా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

దాదా సౌరభ్‌ గంగూలీ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే గంగూలీ బయోపిక్‌ రూపుదిద్దుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా దాదానే ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

‘క్రికెటే నా జీవితంగా మారింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఏ సందర్భంలోనూ తలవంచకుండా ముందుకు సాగడాన్ని నేర్పింది. ఈ ప్రయాణం ఆస్వాదించదగినది. లవ్‌ఫిల్మ్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ నా జీవితాన్ని వెండితెరపైకి సాక్ష్యాత్కరించే బాధ్యత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ దాదా రాసుకొచ్చారు.

ఇక గంగూలీ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. గతంలో దాదా ఓ సందర్భంలో మాట్లాడుతూ తన బయోపిక్‌లో హృతిక్‌రోషన్‌ నటిస్తే బాగుంటుందని అన్నాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. మరీ.. గంగూలీ పాత్రలో హృతిక్ కనిపిస్తాడా ? మరో నటుడిని తీసుకుంటారా ?? అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది.