భాషాభిమానం అంటే ఇదే !
‘గబ్బర్‌సింగ్’ కాంబోలో మరో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. హరీశ్ శంకర్ డైరెక్టర్‌గా పవన్ కల్యాణ్‌తో చేస్తున్న కొత్త చిత్రానికి ఇటీవలే టైటిల్ ని ప్రకటించారు. ‘భవదీయుడు భగత్‌సింగ్’ అని పెట్టారు. ఈ టైటిల్ ఆకట్టుకుంటోంది. పెద్దలు లేదా అధికారులకు ఉత్తరాలు రాసేటప్పుడు చివర్లో భవదీయుడు అని కింద పేరు రాసి ముగిస్తారు. ప్రజలు దాదాపు మరిచిపోయిన ఈ పదాన్ని హరీశ్ శంకర్ తన కొత్త సినిమాకు టైటిల్‌గా పెట్టి మరోసారి భాషపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఇదీగాక ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్ లో ‘గబ్బర్ సింగ్’ ఫ్లేవర్ కనిపిస్తున్నది. ఫలితం కూడా అదే రేంజ్ లో ఉండేలా హరీష్ శంకర్ కథని రెడీ చేశారని సమాచారమ్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటుల వివరాలని త్వరలోనే ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని రికార్డ్స్ సృష్టించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ఆయన అభిమానులు మరిచిపోలేరు. వారి దృష్టిలో గబ్బర్ సింగ్ నే ది బెస్ట్ ఫిల్మ్. మరీ.. ఇప్పుడు దాన్ని మించిన చిత్రాన్ని హరీష్ అందించి.. తన రికార్డుని తానే బద్దలు కొడతాడేమో చూడాలి.