ఐపీఎల్ కోసమే ఐదో టెస్ట్ రద్దు

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ రద్దయిన విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ కి ముందు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు నలుగురుకి కరోనా సోకింది. దీంతో ఆఖరి టెస్ట్ ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు ఆసక్తి చూపలేదు. ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న చర్చలు.. మ్యాచ్ రద్దు చేసే దిశగా సాగాయి. అయితే ఐదో టెస్ట్ రద్దు వెనక అసలు కారణం ఐపీఎల్ నే  అన్నారు ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్‌ హుస్సేన్‌. 

ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకొని టీమ్‌ఇండియా ఇంతకుముందే ఐదో టెస్టును ముందుగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేసింది. ఐపీఎల్ లీగ్‌ భారత ఆటగాళ్లకు ముఖ్యం.. అందులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి అని నాసర్‌ అన్నాడు. ప్రస్తుతం దీన్ని రీషెడ్యూల్‌ చేసే పరిస్థితులు లేనందున భవిష్యత్‌లో ఎప్పుడైనా సర్దుబాటు చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఇందులో టీమ్‌ఇండియా ఆటగాళ్లని తప్పుపట్టడం సరికాదని, గత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లూ వెనకడుగు వేశారని గుర్తుచేశాడు.