భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే.. తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 30 వేల దిగువకు కొత్త కేసులు చేరడం కాస్త ఊరటనిస్తోంది. ఇక మరణాలు మాత్రం 300కుపైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,30,125 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 28,591 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 338 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,42,655కి చేరింది.

కొత్తకేసుల కంటే రికవరీలే అధికంగా నమోదయ్యాయి. నిన్న 34,848 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,24,09,345కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.51%గా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,84,921(1.16%) క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అధిక శాతం ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో కొత్తగా 20,487 కేసులు నమోదు కాగా.. 181 మరణాలు చోటుచేసుకున్నాయి.